వినాయక నిమజ్జనం సందర్భంగా ఈనెల 16వ తేదీ ఉదయం 6గంటల నుంచి 17వ తేదీ ఉదయం 6గంటల వరకు మద్యం విక్రయాలు నిలిపివేయాలని వరంగల్ సీపీ శనివారం సాయంత్రం అంబర్ కిషోర్ ఝా తెలిపారు. గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా పూర్తి చేసేందుకు మద్యం షాపులు బంద్ చేయాలన్నారు. మద్యం సరఫరా చేసే బార్లు, క్లబ్లు, హోటళ్లు మూసివేయాలని సూచించారు. ఎవరైనా మద్యం షాపులు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.