హన్మమకొండలోని కాకతీయ యూనివర్సిటీ నుండి పెద్దమ్మగడ్డ వెళ్లే ప్రధాన రహదారి ప్రమాదకరంగా మారింది. అతివేగంతో వచ్చి గుంతల్లో పడి ప్రమాదాల బారిన పడుతున్నారు. గత కొద్ది కాలంగా నయీమ్ నగర్ నాలా పనుల కోసం వాహనాలను ఇటుగా మళ్లింపు చేశారు. కొన్ని రోజుల కింద కురిసిన భారీ వర్షాలకు రోడ్డుపై గుంతలు ఏర్పడడంతో నిత్యం ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతూనే ఉంది. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు.