దేశం కోసమే సీతారాం ఏచూరి జీవితకాలం పోరాటం చేసారని సీపీఎం హన్మకొండ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సారంపెళ్లి వాసుదేవరెడ్డి అన్నారు. శనివారం 31 డివిజన్ దీందయల్ నగర్, యూటీఎఫ్ భవన్ లో సీతారాం ఏచూరి సంస్మరణ సభ సీపీఎం హన్మకొండ సౌత్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పులమలవేసి నివాళులర్పించారు. ఉన్నత కుటుంబంలో పుట్టి అణగారిన వర్గాల కోసం పోరాటం చేసాడన్నారు.