కేయూ స్పోర్ట్స్ హాస్టల్ విద్యార్థి గత నెల 31న న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మద్యం సేవించి జగ్జీవన్ రామ్ హాస్టల్కు వెళ్లి న్యూసెన్స్ చేశాడు. అంతేగాకుండా అక్కడ విద్యార్థిపై దాడికి పాల్పడ్డాడు. ఈ వ్యవహారం పెట్రోలింగ్ చేస్తున్న పోలీసుల దృష్టికి వెళ్లడంతో విద్యార్థికి కౌన్సెలింగ్ ఇచ్చారని సమాచారం. ఈ ఘటనపై గురువారం కేయూ హాస్టళ్ల డైరెక్టర్ రాజ్ కుమార్ బాధిత ఎంకామ్ విద్యార్దితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.