వరద ముంపు నివారణకు పటిష్ట చర్యలు చేపట్టండి

70చూసినవారు
వరద ముంపు నివారణకు పటిష్ట చర్యలు చేపట్టండి
వరద ముంపు నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ఇంజనీరింగ్ సానిటేషన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం హనుమకొండ పరిధిలోని లోతట్టు ప్రాంతాలైన రామకృష్ణ కాలనీ, ఎస్బిహెచ్ బ్యాంక్ కాలనీ, ప్రగతి నగర్, సమ్మయ్య నగర్, నయీం నగర్, బొక్కల గడ్డ హన్మకొండ బస్టాండ్ ప్రాంతాలతో పాటు వరంగల్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి చేపట్టాల్సిన చర్యలపై కమీషనర్ అధికారులకు తగు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్