వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఐదుగురు ఎస్సైల ను బదిలీ చేస్తూ కమిషనర్ అంబర్ కిషోర్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. జి. దివ్య మడికొండ నుంచి వరంగల్ కు, జి. రాజేష్ రెడ్డి నర్సంపేట నుంచి చెన్నారావుపేటకు, జి. అరుణ్ చెన్నారావుపేట నుంచి నర్సంపేటకు, ఎం. డి. ఫసియోద్దిన్ సీసీఎస్ నుంచి హనుమకొండ ట్రాఫిక్ కు, ఎం. డి. యాకుబ్ కమిషనరేట్ నుంచి సీసీఎస్ కు బదిలీ అయ్యారు.