ఏనుగల్ గ్రామంలో గురువారం జీవవైవిధ్య యాజమాన్య కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ అన్నమనేని లక్ష్మి గ్రామ సర్పంచ్ మరియు బయోడైవర్సిటీ అధ్యక్షురాలు దమ్శెట్టి సంధ్యారాణి, రైతు సమన్వయ సమితి కన్వీనర్ నరసింహ, ఎంపిటిసి కోల మల్లయ్య, ఉప సర్పంచ్ గుండారపు సతీష్ రావు, కార్యదర్శి రమాదేవి, బయోడైవర్సిటీ కార్యదర్శి తమ్మిశెట్టి శ్రీనివాస్ మరియు కమిటీ మెంబర్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జీవవైవిధ్యాన్ని కాపాడాలని మరియు విలేజ్ పార్కుల్లో ఔషధ మొక్కను పెట్టాలని సూచించారు. బయోడైవర్సిటీ కమిటీ ప్రతినెల మీటింగ్ నిర్వహించుకొని రైతులకు ఉపయోగపడేలా పశుపక్ష్యాదులను కాపాడే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని, మొక్కలను రక్షించాలని సూచించడం జరిగింది.