పాడి పరిశ్రమలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను పొందవచ్చని ప్రొగ్రాం కోఆర్డినేటర్ డా. రాజన్న సూచించారు. మంగళవారం వరంగల్ మామునూరు కృషి విజ్ఞాన కేంద్రంలో రైతులకు శాస్త్రీయ పద్దతిలో పాడి పశువుల పెంపకంపై నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పశుపోషణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.