మాజీ సీఎం జగన్‌ను ఏదో రకంగా చేసి అరెస్ట్ చేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మాజీ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. మంగళవారం పేర్నినాని మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. ఎక్సైజ్ శాఖ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డిని బెదిరించి తప్పుడు స్టేట్‌మెంట్ తీసుకోవడమే ఇందుకు సాక్ష్యమని పేర్కొన్నారు. తప్పుడు ఆధారాలతో కౌరవ సభలో ఏదో మాట్లాడితే తాము భయపడమని చంద్రబాబు సర్కార్‌పై మండిపడ్డారు.