తీహార్ జైలును తరలించనున్న ఢిల్లీ సర్కార్

77చూసినవారు
తీహార్ జైలును తరలించనున్న  ఢిల్లీ సర్కార్
ఆసియాలోనే అతి పెద్దదైన తిహార్ జైలును మరో చోటుకు తరలించేందుకు బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఢిల్లీ సీఎం రేఖ గుప్తా జైలు తరలింపునకు రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే జైలు చుట్టుపక్కల ఉన్న ప్రజల భద్రత, రక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇక తిహార్ జైలును 1958లో నిర్మించగా.. 1966లో పంజాబ్ దీని నిర్వహణను ఢిల్లీకి బదిలీ చేసింది. ఈ జైలు 400 ఎకరాల్లో విస్తరించి ఉంది.

సంబంధిత పోస్ట్