తెలంగాణ ఆర్థిక పరిస్థితులపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. అప్పులపై BRS ప్రజలను తప్ప్పుదోవ పట్టిస్తోందన్నారు. బీఆర్ఎస్ పాలనలో చేసినా అప్పులన్నీ తాము తీరుస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 54 వేల కోట్ల అప్పులు చేసిందని వివరించారు. బీఆర్ఎస్ చేసిన అప్పులేమో తినడానికి.. తాము చేసిన అప్పులేమో వడ్డీ కట్టటానికి సరిపోతుందని విమర్శించారు.