రెడ్ బుక్‌లో అందరి పేర్లు రాసుకుంటున్నాం: పాడి కౌశిక్ రెడ్డి

66చూసినవారు
రెడ్ బుక్‌లో అందరి పేర్లు రాసుకుంటున్నాం: పాడి కౌశిక్ రెడ్డి
మంత్రి పొన్నం ప్రభాకర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. ఎన్టీపీసీ నుంచి ఫ్లై యాష్ తరలింపులో భారీ స్కామ్ జరిగిందని ఆరోపించారు. స్వయంగా మంత్రి పొన్నం అన్న కొడుకు అనూప్ ద్వారా వసూళ్లకు పాల్పడ్డారని అన్నారు. తమ వద్ద కూడా రెడ్ బుక్ ఉందని.. అందరి పేర్లు నమోదు చేస్తున్నామని అన్నారు. 'మా టైమ్ వచ్చినప్పుడు మేమేంటో కూడా చూపిస్తాం. అప్పుడు పరిణామాలు తీవ్రంగా ఉంటాయి' అని అన్నారు..

సంబంధిత పోస్ట్