ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును 'ఉగ్రవాది'గా పరిగణిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం శనివారం పేర్కొంది. పాలస్తీనియన్లపై సాగిస్తున్న యుద్ధ నేరాలకు ఆయనను న్యాయస్థానానికి తీసుకురావాలని డిమాండ్ చేసింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సలహాదారు రానా సనావుల్లా దీనిపై మీడియాతో మాట్లాడారు. గాజాపై ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధాన్ని ఖండిస్తూ వేలాది మంది పాకిస్థానీలు ఇస్లామాబాద్ వీధుల్లో ప్రదర్శన చేశారు.