విడాకుల కేసు విచారణలో భాగంగా నటుడు ధనుష్, ఆయన భార్య ఐశ్వర్య రజనీకాంత్ తాజాగా చెన్నై ఫ్యామిలీ కోర్టు ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా.. తాము కలిసి ఉండాలనుకోవడం లేదని, విడిపోవాలని నిర్ణయించుకున్నామని వారు తెలిపారు. ఈ మేరకు కోర్టు తుది తీర్పును ఈ నెల 27కు వాయిదా వేసింది. 2004లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. 18 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నామంటూ వీరు 2022లో ప్రకటించారు.