ఏపీ రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్గా జనసేన ఎమ్మెల్యే పులవర్తి ఆంజనేయులకు అవకాశం దక్కింది. కాసేపట్లో అసెంబ్లీ కార్యదర్శి అధికారికంగా ప్రకటించనున్నారు. వైసీపీ తరపున ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ సంప్రదాయం ప్రకారం విపక్షానికి ఆ పదవి ఇవ్వాల్సి ఉంది. అయితే వైసీపీకి తగినంత బలం లేనందున ఇవ్వకూడదని కూటమి నేతలు నిర్ణయం తీసుకున్నారు.