తెలంగాణలో బీసీ రిజర్వేషన్ బిల్లుకు BRS తరఫున మద్దతు ఇస్తున్నట్లు పార్టీ నేత హరీశ్ రావు ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాలకు రిజర్వేషన్ ఫలాలు అందాలని చెప్పారు. బీసీల కోసం పార్లమెంట్‌లో కొట్లాడుతామని చెప్పారు. పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ పూనుకోవాలన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్‌లలో 50%, వైన్ షాపుల్లో 50% తెచ్చామని చెప్పారు. బీసీల మీద ప్రేమ ఉంటే వారికి ప్రభుత్వ కాంట్రాక్టులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.