2-3 రోజుల్లో పట్టభద్రుల MLC అభ్యర్థిని ప్రకటిస్తాం: TPCC చీఫ్

82చూసినవారు
2-3 రోజుల్లో పట్టభద్రుల MLC అభ్యర్థిని ప్రకటిస్తాం: TPCC చీఫ్
TG: పట్టభద్రుల MLC అభ్యర్థిని 2-3 రోజుల్లో ప్రకటిస్తామని TPCC చీఫ్ మహేశ్‌ కుమార్ గౌడ్ తెలిపారు. HYD-గాంధీ భవన్‌లో సీనియర్ నాయకుడు డి.వి. సత్యనారాయణ రావుకు శనివారం మహేశ్‌ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. టీచర్‌ MLC ఎన్నికల్లో మిత్రపక్షాలకు మద్దతిస్తామని చెప్పారు. MLC అభ్యర్థులుగా నలుగురి పేర్లు పరిశీలనలో ఉన్నాయన్నారు. కార్పొరేషన్‌ పదవుల భర్తీ నెలాఖరులో పూర్తవుతుందని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్