ఐటీ, ఎలక్ట్రానిక్‌ కంపెనీలను ఆకర్షిస్తాం: మంత్రి నారా లోకేశ్‌

76చూసినవారు
ఐటీ, ఎలక్ట్రానిక్‌ కంపెనీలను ఆకర్షిస్తాం: మంత్రి నారా లోకేశ్‌
వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల హామీ నెరవేర్చేందుకు కృషి చేస్తామని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. మంత్రులకు శాఖల కేటాయింపు తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడారు. ఉద్యోగాల కల్పనకు ఇతర రాష్ట్రాలతో తీవ్రంగా పోటీ పడతామన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్‌ కంపెనీలను ఆకర్షిస్తామని తెలిపారు. వలస వెళ్లిన యువతకు స్థానికంగానే ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తామని మంత్రి లోకేశ్‌ తెలిపారు.

సంబంధిత పోస్ట్