TG: ఈనెల 30లోపు రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమచేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. భరోసా కోసం రూ.33 వేల కోట్లు సిద్ధం చేశామని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల రుణమాఫీ ఎగ్గొడితే .. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందని అన్నారు. రైతులను దగాచేసిన వాళ్లు, ముంచిన వాళ్లు రుణమాఫీ గురించి మాట్లాడితే ప్రజలు అసహ్యించుకుంటారని, ప్రజల్లో అపహాస్యం పాలవుతారని తుమ్మల హితవు పలికారు.