ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ పోరులో న్యూజిలాండ్‌తో టీమ్ ఇండియా తలపడనుంది. ఇండియా మ్యాచ్‌లు ఒకే వేదికపై (దుబాయ్) ఆడటం వల్ల భారత్‌కు ప్రయోజనం చేకూరుతోందని పలు దేశాల మాజీలు విమర్శిస్తున్నారు. దీనిపై రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. ఆటతీరును బట్టి గెలుస్తారని.. సాకులతో కాదని, దుబాయ్‌లో ఆడడం వల్ల ప్రయోజనం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నాడు.