దొంగతనానికి వెళ్లి పడుకున్నాడు

66చూసినవారు
దొంగతనానికి వెళ్లి పడుకున్నాడు
యూపీలోని లక్నోలో విచిత్రమైన ఘటన జరిగింది. నగరంలోని ఇందిరా నగర్ సెక్టార్ 20లో శనివారం రాత్రి ఓ దొంగ చోరీ చేసేందుకు వచ్చాడు. ఇంట్లోకి ప్రవేశించి విలువైన సామాన్లు దొంగిలించాడు. అనంతరం ఇంట్లోనే చక్కగా నిద్రపోయాడు. ఉదయం ఇంటి యజమాని వచ్చి చూసి దొంగతనం జరిగిందని గ్రహించాడు. అయితే దొంగ మాత్రం ఇంట్లోనే నిద్రపోవడం గమనించి పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు అక్కడకు చేరుకుని ఆ దొంగను అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్