తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ WEF సదస్సులో పాల్గొనడానికి జ్యూరిచ్ చేరుకున్నారు. అక్కడ సీఎం రేవంత్ బృందానికి ఘన స్వాగతం లభించిందని తెలంగాణ సీఎంవో తెలిపింది. జ్యూరిచ్ విమానాశ్రయంలో సీఎం రేవంత్, ఏపీ సీఎం చంద్రబాబు పరస్పరం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారని పేర్కొంది. రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై వారి మధ్య చర్చ జరిగినట్లు పేర్కొంది.