'బ్రెయిన్ ఈటింగ్ అమీబా' అంటే ఏమిటి?

1549చూసినవారు
'బ్రెయిన్ ఈటింగ్ అమీబా' అంటే ఏమిటి?
నెగ్లేరియా ఫాలెరీ అనేది స్వతంత్రంగా నివసించే ఒక అమీబా. ఇది సూక్ష్మజీవి. కేవలం మైక్రోస్కోప్‌తో మాత్రమే చూడగలం. సరస్సులు, నదులు, నీటి కొలనులు, కాల్వలు వంటి వెచ్చని నీటిలో, బురద మట్టిలో నివసిస్తుంది. దీనినే 'బ్రెయిన్ ఈటింగ్ అమీబా' అని కూడా పిలుస్తారు. నీటిలో ఉండే ఈ అమీబా ముక్కు ద్వారా మనిషి శరీరంలోకి ప్రవేశించి మెదడుకు సోకుతుంది. మెదడు కణజాలాన్ని దెబ్బతీస్తుంది. ఈ అమీబా ఇన్‌ఫెక్షన్ అత్యంత ప్రాణాంతకం.

సంబంధిత పోస్ట్