ఏమిటీ హవాన సిండ్రోమ్‌.? లక్షణాలు ఏంటి.?

60చూసినవారు
ఏమిటీ హవాన సిండ్రోమ్‌.? లక్షణాలు ఏంటి.?
వివిధ దేశాల దౌత్యకార్యాలయ అధికారులకు ఎదురైన మానసిక ఆరోగ్య లక్షణాలనే హవానా సిండ్రోమ్‌గా వ్యవహరిస్తున్నారు. దానికి గురైన వారిలో బయట ఎటువంటి శబ్దం లేకున్నా భారీ శబ్దం వినిపించడం, మైగ్రెయిన్, వికారం, జ్ఞాపకశక్తి మందగించడం, మైకం వంటి లక్షణాలు కనిపిస్తున్నట్లు గుర్తించారు. ఈ సిండ్రోమ్‌ను తొలిసారి క్యూబాలోని హవానా నగరంలోని అమెరికా దౌత్య కార్యాలయం సిబ్బందిలో గమనించారు. ఆ నగరం పేరుపై దీన్ని హవానా సిండ్రోమ్‌గా పిలుస్తున్నారు.

సంబంధిత పోస్ట్