ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా మార్చి 4న తొలి సెమీస్‌లో భారత్ ఆస్టేలియాతో తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీ చరిత్రలో ఆస్ట్రేలియాతో నాలుగుసార్లు టీమిండియా తలపడింది. వీటిలో రెండు మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించగా.. ఒక దాంట్లో ఓటమి పాలైంది. మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. మొత్తానికి ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్‌పై మనదే పై చేయి అని తెలుస్తోంది.