క్యారెట్ సాగుకు అనుకూలమైన కాలం ఏదంటే?

59చూసినవారు
క్యారెట్ సాగుకు అనుకూలమైన కాలం ఏదంటే?
క్యారెట్‌ సాగు చేయాలనుకునే రైతులు ఆగస్టు నుంచి జనవరి మధ్య కాలంలో విత్తుకోవడం వల్ల మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. ఈ పంట 18-25 డిగ్రీలు గల తక్కువ ఉష్ణోగ్రతలో అధిక దిగుబడులతో పాటు మంచి నాణ్యమైన దుంపలను పొందవచ్చు. ఈ పంట 100-110 రోజుల్లో కోతకొస్తుంది. ఎకరా భూమిలో నాటుకోవడానికి 2 నుంచి 2.5 కేజీల విత్తనం సరిపోతుంది. ఇక బరువైన బంకమట్టి నేలలు ఈ పంటకు పనికిరావు. నేలలో ఉదజని సూచిక 6.5 ఉంటే మంచిది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్