లేచి చూసేసరికి ఊరంతా కొట్టుకుపోయింది

50చూసినవారు
లేచి చూసేసరికి ఊరంతా కొట్టుకుపోయింది
హిమాచల్‌ ప్రదేశ్‌లో కుంభ వృష్టి కారణంగా మెరుపు వరదలు సంభవించాయి. లేచి చూసేసరికి శిమ్లా జిల్లా రాంపూర్‌ ప్రాంతంలోని సమేజ్ ఖాడ్‌లో మా ఇల్లు తప్ప అంతా ధ్వంసమైందని అనితాదేవీ ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘పెద్దశబ్దంతో ఏం జరిగిందో చూసేందుకు మేం బయటకువచ్చాం. అంతా నీరే. ఊరంతా కొట్టుకుపోయింది. భయంతో మేమంతా కాళీమాతా ఆలయం వద్ద తల దాచుకున్నాం.’’ అని అనిత తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. ఈ విలయంలో 53 మంది గల్లంతయ్యారు.

సంబంధిత పోస్ట్