తెలంగాణ ప్రభుత్వం హైడ్రా పేరుతో సామాన్య ప్రజల మీద ప్రతాపం చూపడం కాదు.. పాతబస్తీలోని అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని BJP శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. సీఎంకు ధైర్యముంటే సల్కం చెరువులో ఉన్న ఓవైసీ అక్రమ నిర్మాణాలను కూల్చాలని సవాల్ విసిరారు. 20 ఏళ్లుగా పాతబస్తీలో చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు. బుల్డోజర్లు పాతబస్తీకి వెళ్లడానికి పెట్రోల్, డీజిల్ ఉందో లేదో చెప్పాలని ఎద్దేవా చేశారు.