నాగార్జున సాగర్ జలాశయం మరో 2, 3 రోజుల్లో పూర్తిగా నిండే అవకాశం ఉంది. శ్రీశైలం నుంచి సాగర్ కు 4.94 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 565 అడుగులుగా ఉంది. సాగర్ నీటినిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా ప్రస్తుతం 244 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. కాలువల ద్వారా 29 వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.