అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన వ్యక్తి ఎవరు?

70చూసినవారు
అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన వ్యక్తి ఎవరు?
అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన వ్యక్తిగా రష్యా కాస్మోనాట్‌ ఒలెగ్‌ కొనొనెంకొ రికార్డు సృష్టించారు. ఈయన 2008 నుంచి ఇప్పటివరకు అయిదు సార్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌) వెళ్లారు. ఫిబ్రవరి 4, 2024 నాటికి మొత్తంగా 878 రోజుల 12 గంటల పాటు అంతరిక్షంలో ఉన్నారు. ఇప్పటి వరకు ఈ రికార్డు రష్యాకు చెందిన గెన్నడీ పడల్కా (878 రోజుల 11 గంటల 29 నిమిషాల 48 సెకన్లు) పేరిట ఉంది.

సంబంధిత పోస్ట్