దేవుళ్లు, మహర్హులంతా ఉత్తరాయణంలోనే జన్మించారు. కానీ, శ్రీకృష్ణుడు మాత్రం దక్షిణాయనంలో జన్మించారు. ఉత్తరాయణం పగటికి ప్రతీక అయితే దక్షిణాయనం రాత్రికి ప్రతీకగా భావిస్తారు. ఇక అమావాస్య ముందు వచ్చే అష్టమి అంటే చిమ్మ చీకటి.. పైగా అర్దరాత్రి చెరశాలలో లోక కళ్యాణార్థం శ్రీకృష్ణుడు జన్మించాడు. మనలో నిండిన అంధకారాన్ని తొలగించి జ్ఞానం అనే వెలుగు వైపు నడిపించాలని కోరుతూ కృష్ణుడిని ఇంట్లోకి ఆహ్వానిస్తారు.