హనుమాన్ జయంతి ఏడాదిలో రెండు సార్లు ఎందుకు?

56చూసినవారు
హనుమాన్ జయంతి ఏడాదిలో రెండు సార్లు ఎందుకు?
సీతాన్వేషణకై లంకకు బయలుదేరిన హనుమంతుడు సీతమ్మ ఆచూకీ కనుగొన్నాడు. ఆరోజు చైత్రమాసం, చిత్రా నక్షత్రం, పౌర్ణమి రోజు. సీతమ్మను కనుగొన్న ఆనందంలో హనుమాన్ అశోక వనాన్ని ధ్వంసం చేస్తాడు. రావణాసురుని సైన్యం హనుమంతుని తోకకు నిప్పంటించగా ఆ తోకతో సగం లంకను దహనం చేస్తాడు. హనుమంతుడు రావణ సైన్యంపై విజయం సాధించినందుకు గుర్తుగా చైత్ర శుద్ధ పౌర్ణమి రోజును హనుమంతుని విజయోత్సవంగా జరుపుకోవాలి. ఇది తెలియని వారు ఆ రోజును హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు.

సంబంధిత పోస్ట్