బీజేపీకి జై కొడితేనే.. అవార్డులిస్తారా?: ఎంపీ చామల

76చూసినవారు
బీజేపీకి జై కొడితేనే.. అవార్డులిస్తారా?: ఎంపీ చామల
దివంగత ప్రజా గాయకుడు గద్దర్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన సోమవారం ఎక్స్ వేదికగా బీజేపీకి జై కొడితేనే.. పద్మ అవార్డులు ఇస్తారా? అంటూ ఒక వీడియో విడుదల చేశారు. ప్రజా యుద్ధ నౌక గద్దర్ గురించి బండి సంజయ్ మాటలు హాస్యాస్పదమన్నారు. రైట్ వింగ్, బీజేపీ భావజాలం ఉన్న వాళ్ళకే పద్మ అవార్డులు ఇస్తామనే విధంగా ఆయన మాట్లాడుతున్నారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్