AP: తిరువూరు MLA కొలికపూడి శ్రీనివాస్ ఎపిసోడ్ టీడీపీలో కాకరేపుతోంది. పార్టీ నేత రమేశ్ రెడ్డిపై తీసుకోకపోతే 48 గంటల్లోగా రాజీనామా చేస్తానని కొలికపూడి 2 రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. శనివారం 11 గంటలకు డెడ్ లైన్ పూర్తవనుంది. దీంతో MLA ఏం చేస్తారనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు కొలికపూడి తీరుపై TDP అధిష్టానం ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. అతనిపై చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.