న్యాయం కోసం పవన్ కళ్యాణ్‌ను కలుస్తా: లావణ్య

53చూసినవారు
న్యాయం కోసం పవన్ కళ్యాణ్‌ను కలుస్తా: లావణ్య
రాజ్ తరుణ్ పెళ్లి చేసుకుని మోసం చేశారని కేసు పెట్టిన లావణ్య.. న్యాయం కోసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవనున్నట్లు తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'నాకు పవన్ అంటే ఇష్టం. రాజ్ నన్ను వదిలేసి పారిపోయాడని, న్యాయం చేయాలని అడగాలనుకుంటున్నా. పవన్‌కు కూడా పెళ్లిళ్లు అయ్యాయి. ఆయన తన భార్యలకు ప్రాధాన్యత ఇచ్చారు. బాధ్యతలు వదులుకోలేదు. రాజ్ నాకు తిండికీ డబ్బులు ఇవ్వట్లేదు' అని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్