AP: రేపల్లె పట్టణంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక లోటు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో నవంబర్ నుంచి 80 లక్షల మంది మహిళలకు 35 వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు అందించడానికి లక్ష్యంగా సీఎం పని చేస్తున్నారని వెల్లడించారు.