తెలంగాణ కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన కేసీఆర్ చావును కోరుకోవడం చాలా దారుణమని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కేసీఆర్ చావును కోరుతూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు హరీష్ శనివారం పేర్కొన్నారు. దానికి నిరసనగా శాసనసభలో సీఎం రేవంత్ ప్రసంగాన్ని బహిష్కరించినట్లు ఆయన తెలిపారు. కేసీఆర్ చేసిన పోరాటం వల్లే తెలంగాణకు నీటి న్యాయం సాధ్యమైందని అన్నారు.