పచ్చి బొప్పాయితో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పచ్చి బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. దీనిని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. ఇంకా రక్తపోటు తగ్గి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా పురుషులలో వచ్చే ప్రోస్టేట్ క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్ వంటి క్యాన్సర్ల ప్రమాదం నుంచి ఉపశమనం కలుగుతుంది.