ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో నడిరోడ్డుపై ఓ మహిళా కానిస్టేబుల్‌పై దాడి జరిగింది. సివిల్ దుస్తుల్లో ఉన్న ఓ లేడీ పోలీస్ ఓ వీధిలో వెళ్తుండగా వెనుక నుంచి బైకుపై వచ్చిన ఓ వ్యక్తి ఆమెను ఆపి వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో ఆమెకు కోపం వచ్చి అతడిని తోసింది. దీంతో అతడు ఆమెను చెంపపై కొడుతూ తిరిగి దాడి చేశాడు. కింద పడేసి మరీ కొట్టాడు. తర్వాత మరో వ్యక్తి కూడా ఆమెపై దాడి చేశాడు. కాగా దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.