ఒక మహిళ ఆస్తి కోసం తన తల్లిదండ్రుల ఇంటిపై ఇటుకలు విసిరి వేధించింది. ఆగ్రాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సురేఖ కుమారి అనే మహిళ తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని తన తల్లిదండ్రులతో సంబంధాలు తెంచుకుంది. అయితే, ఇప్పుడు ఆస్తిలో వాటా కావాలంటూ వారిపై ఒత్తిడి తెస్తోంది. ఈ క్రమంలో గత నెల 26న తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి వారి ఇంటిపై ఇటుకలు విసిరింది.