కట్నం ఇవ్వనందుకు.. మహిళను చెట్టుకు కట్టేసి కొట్టారు (Video)

63చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌ జిల్లాలో ఈ నెల 6న అత్రౌలీ గ్రామంలో ఒక మహిళను అత్తింటి వారు దారుణంగా హింసించారు. ఆమె తండ్రి మరణించడంతో కట్నంగా బైక్‌ ఇవ్వలేకపోవడంపై వారు ఆగ్రహించారు. ఆ మహిళను ఇంటి నుంచి బయటకు ఈడ్చుకొచ్చారు. ఆమెను చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. దీంతో ఆ మహిళ బాధతో ఏడ్చింది. గ్రామస్తులంతా దీనిని చోద్యం చూశారు. ఆ యువతిని కాపాడేందుకు ఎవరూ ముందుకురాలేదు. కాగా, విషయం తెలిసిన పుట్టింటి వారు మహిళను కాపాడి తమతో తీసుకెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్