చెరుకు రసం తీసే మెషీన్‌లో అనుకోకుండా ఓ మహిళ జడ ఇరుక్కుపోయింది. దీంతో అక్కడ ఉన్నవారు వెంటనే అప్రమత్తమై ఆమె ఆ మెషీన్‌ను ఆఫ్ చేశారు. ఆ తరువాత నెమ్మదిగా చెరుకు రసం తీసే యంత్రాన్ని వెనక్కి తిప్పుతూ ఆ మహిళ జడను బయటికి తీశారు. కొంచెం ఉంటే ఆమె జడతో సహా తల కూడా మెషీన్‌లోకి వెళ్ళిపోయి ఉండేది. అదృష్టవశాత్తూ ఆ మహిళ ఈ ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.