నారాయణ కాలేజీలపై తెలంగాణ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలేజీల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై కమిషన్ సీరియస్ అయింది. ఇటీవల కాలంలో ముగ్గురు నారాయణ కాలేజీ విద్యార్థులు ఆత్మహత్యలకు సంబంధించి డిసెంబర్ 11, 2024 ఉదయం 11:00 గంటలకు కమిషన్ ముందు హాజరు కావాలని నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కు సమన్లు పంపింది. విద్యార్థుల భద్రతకు భంగం కలిగించే ఏదైనా సంస్థపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.