కామ్రేడ్ మేకల రాములు ఐదో వర్ధంతి సభ

661చూసినవారు
కామ్రేడ్ మేకల రాములు ఐదో వర్ధంతి సభ
సమసమాజ స్థాపన కోసం పేద వర్గాల అభ్యున్నతికి దున్నే వాడికే భూమి దక్కాలనే నినాదం ఉద్భవించిన విప్లవోద్యమంలో అనేక మంది విప్లవకారులు తమ జీవితాలను తృణప్రాయంగా అర్పించారు. అలాంటి వీరుల్లో కామ్రేడ్ మేకల రాములు ఓ వేగుచుక్క అని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి మామిడాల బిక్షపతి కొనియాడారు. యాదగిరిగుట్ట మండలంలోని ధర్మారెడ్డి గూడెం గ్రామంలో భారత కార్మిక సంఘాల సమైక్య ఐ. ఎఫ్. టి. యు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు కామ్రేడ్ మేకల రాములు అయిదవ వర్ధంతి సభ గ్రామ కార్యదర్శి మిట్ట సాయిలు అధ్యక్షతన జరిగింది. ఈ సభను హాజరైన సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మామిడాల బిక్షపతి, అఖిల భారత రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కళ్లెపు అడివయ్య, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి ఇక్కిరి సహదేవ్ లు మాట్లాడుతూ.. కామ్రేడ్ మేకల రాములు బోనగిరి, ఆలేరు ప్రాంతంలో జరిగిన రైతాంగ పోరాటంలో కార్మిక ఉద్యమాలలో క్రియాశీలక పాత్ర పోషించారు అని ఆయన సేవలను కొనియాడారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్