యాదాద్రిలో భక్తుల రద్దీ

70చూసినవారు
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహ స్వామివారి ఆలయానికి భక్తుల పోటెత్తారు. ఆదివారం కావడంతో యాదాద్రీశ్వరుడిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి. స్వామివారి ఉచిత దర్శనానికి దాదాపు మూడు గంటల సమయం పడుతున్నది. అతి శీఘ్ర దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ పెరగడంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇంబ్బంది కలుగకుండా చూస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్