అనాధలకు వృద్ధులకు ఆహార పంపిణీ

178చూసినవారు
అనాధలకు వృద్ధులకు ఆహార పంపిణీ
యాదగిరిగుట్ట మండల శాఖ భారతీయ జనతా పార్టీ సేవ హి సంఘటన కార్యక్రమంలో అనాధలకు, కరోనా పేషెంట్ లకు, వృద్ధులకు, పారిశుద్ధ్య కార్మికులకు శుక్రవారం 200 ఆహార పొట్లాలు 13 వ రోజు ఇవ్వడం జరిగింది. యాదగిరిగుట్ట బిజెపి మండల అధ్యక్షులు కళ్లెం శ్రీనివాస్ గౌడ్, జిల్లా కోశాధికారి కాదురి అచ్చయ్య మాట్లాడుతూ కరోనాతో బాధపడుతున్న ఎవరైనా మా భారతీయ జనతా పార్టీ నాయకులకు ఎవరైనా సమాచారం ఇచ్చినట్టు అయితే వారికి తగిన సహాయం చేస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించి ఇంట్లో ఉండి బయటికి వెళ్లకుండా తగిన చర్యలు తీసుకున్నట్లయితే కరోనా భారీ నుంచి తప్పించుకోవచ్చని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోలా అనిల్ గౌడ్, ఎగ్గిడి శ్రీకాంత్, భీమ గాని మధు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్