యాదగిరిగుట్ట పట్టణ శాఖ ఆధ్వర్యంలో హోంగార్డ్స్ పోలీస్ సిబ్బందికి సానిటైజర్స్ మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. బీజేపీ సీనియర్ నాయకులు రచ్చ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంత కరోనా సమయంలో కూడా ప్రాణాలకు తెగించి తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ తమ విధులు నిర్వర్తిస్తూ ఉన్న సిబ్బందికి భారతీయ జనతా పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నామనీ అన్నారు. అధ్యక్షులు బోనగిరి శ్యాంసుందర్ టెంపుల్ ఏఈఓ గజవల్లి రమేష్ బాబు, జమిందార్ వసంత రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి రాయగిరి, రాజు, నరసింహాచారి హోంగార్డు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.