యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని గురువారం బీఆర్ఎస్ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అంతకుముందు ఆలయంలో ఆర్జిత పూజలు సుదర్శన నరసింహ హోమంలో పాల్గొన్నారు. దర్శనానికి వచ్చిన సమయంలో ఆయన వెంట వరంగల్, ఖమ్మం, ఉమ్మడి నల్గొండ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి, స్థానిక బీఆర్ఎస్ నేతలు ఉన్నారు.