ఆలేరు నియోజక వర్గం బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సోమవారం యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత రెడ్డి తన భర్త మహేందర్ రెడ్డితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం పోలింగ్ కేంద్రం సమీపంలో విలేకరులతో మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొవలని సూచించారు.