యాదాద్రిలో వైభవంగా నిత్య కళ్యాణం

63చూసినవారు
యాదాద్రిలో వైభవంగా నిత్య కళ్యాణం
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి నిత్య కల్యాణోత్సవాన్ని అర్చకులు మంగళవారం శాస్ర్తోక్తంగా జరిపించారు. ఉదయం స్వామి వారికి సుదర్శన నారసింహ హోమం, కల్యాణమూర్తులకు గజవాహన సేవ నిర్వహించారు. అనంతరం వెలుపలి ప్రాకార మండపంలో తూర్పునకు అభిముఖంగా స్వామి, అమ్మవార్లను వెంచేపు చేసి కల్యాణోత్సవం జరిపించారు. కల్యాణ వేడుకలో వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులు స్వయంభువుడిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్